మంగళవారం డాక్‌ సేవా అవార్డుల ప్రదానోత్సవం

హైద‌రాబాద్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్రంలో పోస్టల్‌ శాఖలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి 2020 ఏడాదికి గాను డాక్‌ సేవా అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఆబిడ్స్‌లోని చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో మంగళవారం ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పోస్టల్‌ సర్వీసెస్‌ బోర్డు బ్యాంకింగ్‌ అండ్‌ డీబీటీ సభ్యురాలు కె.సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ మేరకు తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ కార్యాలయ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here