మస్తే శేరిలింగంపల్లి: అయోధ్యలో నిర్మితమవుతున్న శ్రీరామ భవ్య మందిర నిర్మాణానికి త్రివేణి విద్యాసంస్థల అధినేత గొల్లపూడి వీరేంద్ర చౌదరి 1,01,116 నిధి సమర్పణ చేశారు. సోమవారం ఆర్ ఎస ఎస్ సికింద్రాబాద్ శారీరక ప్రముఖ్ నారాయణ మూర్తి, బిజెపి రంగారెడ్డి జిల్లా నాయకులు చింతకింది గోవర్ధన్‌గౌడ్ లకు నిధి సమర్పణ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వీరేంద్రచౌదరి మాట్లాడుతూ మాట్లాడుతూ రామ జన్మభూమి అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణం ప్రతీ ఒక్క హిందువు కల అన్నారు. రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకునేందుకు దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు ముందుకు వస్తున్నారన్నారు. మందిర నిర్మాణంలో పాలు పంచుకునేందుకు అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. రామకార్యంలో భాగస్వాములైన వీరేంద్రచౌదరికి రామసేవకులు వినయకుమార్‌పుట్ట కృతజ్ఞతలు తెలిపారు.
