శేరిలింగంపల్లి, అక్టోబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడు, PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రంగారెడ్డి జిల్లా నాయకుడు శోభన్, శేరిలింగంపల్లి కార్యదర్శి కొంగరి కృష్ణ మాట్లాడుతూ అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్స్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అంగన్ వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్, మినీ టీచర్లకు సక్రమంగా ప్రతినెల జీతాలు వచ్చేలా చూడాలని కోరారు. అంగన్ వాడి కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించే విధంగా బడ్జెట్ కేటాయించాలని కోరారు. మినీ అంగన్‌వాడి సెంటర్లను ప్రభుత్వం మెయిన్ సెంటర్ గా గుర్తించినప్పటికీ టీచర్లకు రావాల్సిన జీతభత్యాలు వచ్చే విధంగా చూడాలన్నారు.
అంగన్‌వాడి కేంద్రాలకు అద్దె భవనాలకు ప్రభుత్వం రూ.3 వేలు ఇస్తుంది కానీ మహానగరంలో అద్దె భవనాలు రూ.10,000 ఉన్నాయని, మిగిలిన అద్దె టీచర్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కనుక రూము రెంట్లను పెంచే విధంగా చూడాలని కోరారు. అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు, మినీ టీచర్లకు డబల్ బెడ్ రూములు వచ్చే విధంగా చూడాలన్నారు.