నమస్తే శేరిలింగంపల్లి: పట్టణ ప్రగతి ద్వారా ప్రజలకు మెరుగైన మౌలికవసతులు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్ర నాయక్ తండా, సర్వే ఆప్ ఇండియాలో శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్లపై పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని శానిటేషన్ సిబ్బందితో తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ సూచించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఏఈ ప్రశాంత్, వాటర్ వర్క్స్ మేనేజర్ నివర్థీ, ఎస్ఆర్ పి శ్రీనివాస్ రెడ్డి, చంద్ర నాయక్ బస్తి అధ్యక్షుడు లాలూ నాయక్, హున్య నాయక్, ఖున్య నాయక్, రవి నాయక్, శ్రీను నాయక్, రాములు, వార్డు సభ్యులు రామచందర్, గుమ్మడి శ్రీనివాస్, సూర్య చందర్, శ్రీను, శివ నాయక్, వర్మ, గణపతి, ప్రభాకర్ చారి, జవహర్ రెడ్డి, రవి నాయక్, చక్రపాణి, బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
హఫీజ్ పేట్ డివిజన్ లో…
హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్, ఎలక్ట్రికల్ డీఈ సునీల్, ఏఈ ప్రతాప్, వాటర్ వర్క్స్ డీజీఎం నాగప్రియ, మేనేజర్ మానస, శానిటేషన్ ఎస్ఆర్ పి మహేష్, ఎంటమాలజీ గణేష్, వార్డు సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, రామకృష్ణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బాలింగ్ రమేష్ గౌడ్, బాబు గౌడ్, రాజారామ్, నర్సయ్య, పరమేష్ ముదిరాజ్, రాజేశ్వర్ రావు, బెనర్జీ, ఆంజనేయులు, శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.