చందాన‌గ‌ర్‌, అమీన్‌పూర్ ర‌హ‌దారిని త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని బీజేపీ ధ‌ర్నా

శేరిలింగంప‌ల్లి, జూన్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్‌, అమీన్‌పూర్ ర‌హ‌దారి విస్త‌ర‌ణ పనులు త్వ‌ర‌గా చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తూ శ‌నివారం బీజేపీ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా బిజెపి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ నిత్య నరకంగా మారిన చందానగర్ అమీన్‌పూర్ రోడ్డు విస్తరణ జరిగి ఏడు సంవత్సరాల గడిచినా ఇప్పటికీ వాహనదారులకు నరకయాతనగా మారింద‌న్నారు. రోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో రాజేంద్రనగర్ కమాన్ మైసమ్మ గుడి వ‌ద్ద‌ ధర్నా నిర్వ‌హించ‌నున్నామ‌ని, ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, కాలనీల వాసులు పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here