శేరిలింగంపల్లి, జూన్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్‌పల్లి కోర్ట్స్ కాంప్లెక్స్‌లో బార్ అసోసియేషన్, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ సమన్వయంతో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవం, ఫలవంతమైన మొక్కల నాటడం కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. వెంకటేశ్వర రావు, సీనియర్ సివిల్ జడ్జిలు జయరాం రెడ్డి, సంధ్య రాణి, జూనియర్ సివిల్ జడ్జిలు ప్రతీక్ సిహాగ్, ప్రిథ్వీ రాజ్, శాలిని, గిరిజ, ప్రియాంక, బార్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి పెద్ద, జనరల్ సెక్రటరీ సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన లోక్ అదాలత్‌లో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన 2302 కేసులను సెటిల్ చేయగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన 3721 కేసులను పరిష్కరించారు. మొత్తం 6023 కేసులను ఈ జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈసీ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.