నమస్తే శేరిలింగంపల్లి: కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రజా మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నవోదయ కాలనీలో రూ.21 లక్షలతో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పైపు లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. వర్షపు నీరు, మురుగు నీరు, ఎక్కడా నిల్వ ఉండకుండా చూస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏఈ సునీల్, వాటర్ వర్క్స్ మేనేజర్ యాదగిరి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, నవోదయ కాలనీ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు, సీనియర్ నాయకులు ప్రభాకర్, శేఖర్, దేవేందర్, రంగస్వామి ముదిరాజ్, నరసింహ, చిన్న, నరేందర్, నవోదయ కాలనీ వాసులు జీవన రాజు, సూర్య శంకర్, రమేష్, భూపాల్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, నాగూర్, లక్ష్మణ్ రావు, గిరి, ఫణింద్ర, వంశీ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.