నమస్తే శేరిలింగంపల్లి:మొక్కలను,చెట్లను పూజించే సంస్కృతి మనదని, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మొక్కల సంరక్షణ తోనే మానవ మనుగడ సాగుతుందని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టెలికాంనగర్ లో ఆదివారం జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్థానిక నాయకుల తో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ రక్షణ కోసం పాటుపడాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షించాలన్నారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని శానిటేషన్ సిబ్బందికి కార్పొరేటర్ సూచించారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు తదితర మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పట్టణ ప్రగతి దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు దినేష్ యాదవ్, టెలికాంనగర్ కాలనీ సభ్యులు రవీందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రాజేందర్ ప్రసాద్, సుభాష్, రవి, మురళి కృష్ణ, వెంకట్ రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు, ఎస్ ఆర్ పీ కృష్ణ , శానిటేషన్ సూపర్ వైజర్ రషీద్ , శ్రీనివాస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
