నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని శిల్ప పార్క్ కాలనీలో శ్రీ రామలింగెశ్వర ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ ఆలయంలోని విగ్రహాల ప్రతిష్టాపన ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలొ ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, బిజెపి రాష్ట్ర నాయకులు యం.రవి కుమార్ యాదవ్, జ్ఞానేంద్ర ప్రసాద్‌లు ప్రత్యేక పూజలు ఆచరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కాలనీలలో ప్రార్ధన మందిరాల ఏర్పాటు వల్ల ఎన్నో ఉపయోగాలుంటాని, ముఖ్యంగా మందిరానికి వెళ్లే వారికి మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. శిల్పా పార్కులోని ప్రశాంత వాతావరణంలో శ్రీ రామలింగేశ్వర ఆలయ ప్రతిష్టాపన జరుపుకోవడం సంతోహషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కాంటెస్టెడ్ కార్పొరేటర్లు రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, నాయకుల బాల కుమార్ తదితరులు పాల్గొన్నారు.