శేరిలింగంపల్లి, మార్చి 18 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ వెంకట నగర్, జనప్రియ వెస్ట్ సిటీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిపై కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ… లక్ష్మీ వెంకట నగర్, జనప్రియ వెస్ట్ సిటీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు కాలనీలలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై తమను కలవడం జరిగిందని, లక్ష్మీ వెంకట నగర్, జనప్రియ వెస్ట్ సిటీ కాలనీలలో మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ వెంకట నగర్ కాలనీ వాసులు శ్రీనివాసరావు, మోహన్, మోహన్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, శివ కోటేశ్వరరావు, జనప్రియ వేస్ట్ సిటీ అసోసియేషన్ సభ్యులు లక్ష్మణ్ ప్రసాద్, సత్యనారాయణ రెడ్డి, మోహన్ రెడ్డి, రామలింగం గౌడ్, మల్లికార్జున్, ఇమనియల్, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.