శేరిలింగంపల్లి, నవంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.3,60,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను బాధితులకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి బాధితులకు అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.