శేరిలింగంపల్లి, నవంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని పాపిరెడ్డి కాలనీ తదితర కాలనీల నుండి చందానగర్ వైపు వెళ్లే చందానగర్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నెలకొన్న సమస్యను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధిత అధికారులతో చర్చించి స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాహదారులకు ఉపయోగపడేలా అండర్ బ్రిడ్జిని అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చారు. అందులో భాగంగా అండర్ బ్రిడ్జి వద్ద సీవరేజ్ వల్ల వచ్చిన నీటిని తొలగించిన పనులను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఏఈ భాస్కర్ తో పాటు కాలనీ వాసులతో కలిసి పర్యవేక్షించారు.
ఈ సమస్య మరల తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏ చిన్న సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, పాపి రెడ్డి కాలనీ ప్రెసిడెంట్ కొండల్ రెడ్డి, వార్డ్ మెంబర్ రాంబాబు, వార్డ్ మెంబర్ శ్రీకళ, కే.లింగా రెడ్డి, సందయ్య నగర్ కాలనీ ప్రెసిడెంట్ బస్వరాజ్, రమేష్, ప్రభాకర్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, కుమారి, సుధారాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.