శేరిలింగంపల్లి, జూన్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయం 14వ వార్షికోత్సవం కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాంబశివరావు, బృందరావు, సత్యం, అక్కరావు, రాములు యాదవ్, నర్సింహ, వెంకటేష్ , ముక్తార్, హరి కృష్ణ , శ్రీజ రెడ్డి, శశిరేఖ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.