బిజెపి ప్రజా సంగ్రామ యాత్ర కరపత్రం విడుదల

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 28 న చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్రను జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ కోరారు. గురువారం ప్రజా సంగ్రామ యాత్ర కరపత్రాన్ని విడుదల చేశారు. 28వ తేదీ ఉదయం 9 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో బండి సంజయ్ పూజలు నిర్వహించి ఈ యాత్రను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు రాములు, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, మోహన్ , జిల్లా ప్రధాన కార్యదర్శి భూపేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బుచ్చిరెడ్డి, కార్యదర్శి అనిల్ గౌడ్, జిల్లా ఓబీసీ మోర్చా నాగుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంగ్రామ యాత్ర కరపత్రాన్ని విడుదల చేస్తున్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here