నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పరిశీలించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి పాఠశాలల పునః ప్రారంభం కానున్న దృష్ట్యా నల్లగండ్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. పాఠశాల పరిసరాలను, క్రీడా మైదానాన్ని గంగాధర్ రెడ్డి శ్రమదానం చేసి శుభ్ర పరిచారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, ఏఈ కృష్ణవేణి, వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాధ్, ప్రధాన ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.