తెలంగాణా బీసీ క‌మీష‌న్ చైర్మ‌న్ వ‌కుళాభ‌ర‌ణంను స‌న్మానించిన‌ శిష్ట‌క‌ర‌ణ సంక్షేమ సంఘం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణా రాష్ట్ర బీసీ క‌మీష‌న్ చైర్మ‌న్ గా నియ‌మితులైన డాక్ట‌ర్ వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌ణ్ రావును శిష్ట‌క‌ర‌ణం సంక్షేమ సంఘం స‌భ్యులు ఘ‌నంగా స‌న్మానించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ ఓబీసీ సాధ‌న క‌మిటీ క‌న్వీన‌ర్ డీవీ కృష్ణారావుల ఆధ్వ‌ర్యంలో కృష్ణ‌మోహ‌న్‌రావును క‌లిసిన శిష్ట‌క‌ర‌ణం సంఘం స‌భ్యులు శాలువాతో స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా సభ్యులు మాట్లాడుతూ బీసీ కులాల ఆశాజ్యోతి, సామాజిక‌వేత్త, బీసీ ఉద్య‌మాల కీర్తి కిరీటం వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్ కృషిని తెలంగాణ ప్ర‌భుత్వం గుర్తించి స‌ముచిత స్థానం క‌ల్పించింద‌ని అన్నారు. కృష్ణ‌మోహ‌న్ నాయ‌క‌త్వంలో రాష్ట్రంలో బిసిల ఆర్థిక, సామాజిక పురోభివృద్ది మ‌రింత‌గా జ‌రుగుతంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. కృష్ణ‌మోహ‌న్ మ‌రిన్ని ఉన్న‌త ప‌ద‌వులు అధిరోహించాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో శిష్ట‌క‌రణ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బి. విజ‌య్ కుమార్, అడిష‌న‌ల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మోటూరి నారాయ‌ణ‌రావు, కోశాధికారి ఉరిటి పార్వ‌తీశ‌రావు సంఘ ముఖ్య స‌ల‌హాదారులు పార్థ‌సార‌ధి, యం శంక‌ర్ ప‌ట్నాయ‌క్, టి. ప్ర‌తాప‌రాజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

బీసీ కమిషన్ చైర్మన్ ను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న శిష్టకరణ సంక్షేమ సంఘం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here