జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, జూన్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ డివిజన్ లోని ప్రధాన సమస్యలను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా నవోదయ కాలనీలో ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న డ్రైనేజీ అవుట్ లెట్ సమస్యపై చర్చిస్తూ, తక్షణమే చర్యలు తీసుకోవాలని మేయర్ ని కోరారు. అక్కడి కాలనీలో డ్రైనేజీ అవుట్ లెట్ లేకపోవడం వల్ల జలాలు రోడ్లపైకి వచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. అపర్ణ సరోవర్ వెనుక భాగంలోని ఓపెన్ ఏరియాలోకి మొత్తం సీవేజ్ నీరు చేరుతుండడం వల్ల అక్కడి నివాసితులు తీవ్రమైన దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని వివరించారు.

దీంతోపాటు, చిన్న‌ వర్షాలు పడినప్పటికీ వీధులు మునిగిపోతున్నాయని, వర్షపు నీటి పైపులు, డ్రైనేజీ కాలువలు కూడా శాసనబద్ధంగా నిర్మించాల్సిన అవసరం ఉందని గంగాధర్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. న‌వోదయ కాలనీకి ప్రత్యేకంగా డ్రైనేజీ అవుట్ లెట్ ఏర్పాటు చేయాల‌ని, అపర్ణ సరోవర్ వెనుక భాగంలో ఉన్న ఓపెన్ ఏరియాలోకి సీవేజ్ నీరు వెళ్లకుండా నివారించే చర్యలు చేప‌ట్టాల‌ని, కొత్త డ్రైనేజీ కాలువలు నిర్మించేందుకు తక్షణంగా ప్రణాళికలు రూపొందించాల‌ని, ప్రజల ఆరోగ్యం, శుభ్రత దృష్టిలో ఉంచుకుని పక్కా ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. మున్సిపల్ అధికారులు వీటిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గంగాధర్ రెడ్డి కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here