అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై కేంద్ర మంత్రికి కసిరెడ్డి భాస్కర రెడ్డి ఫిర్యాదు

నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్, చందానగర్ పోలీసులు అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కేంద్ర పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖామంత్రి గంగాపురం కిషన్ రెడ్డి కి బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని దిల్ కుషా గెస్ట్ హౌస్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని, ప్రత్యర్థులపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కసిరెడ్డి ‌భాస్కర రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి, చందానగర్ పోలీసులు పెట్టిన అక్రమ కేసుల్లో తగిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో బిజెపి రాష్ట్ర మహిళా నాయకురాలు కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి ఉన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న కసిరెడ్డి భాస్కర రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here