నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మాక్త మహబూబ్ పేట్ విలేజ్ లో నూతనంగా చేపట్టిన మంజీర మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులను మంగళవారం స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ మౌళికవసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ సాయి చరిత, వర్క్ ఇన్సెపెక్టర్ రమేష్, టీఆర్ఎస్ నాయకులు గుండె దయనంద్ ముదిరాజ్, బాలమని, చారి, సురేష్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.