బీసీల ఆర్థిక స్వావలంబనకే బీసీ బంధు: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

  • 300 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: కుల వృత్తులకు పునరుజ్జీవనం బీసీబంధు అని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీసీ బందు పథకం ద్వారా మంజూరైన 300 మంది లబ్ధిదారులకు రూ. 3 కోట్ల విలువైన ఆర్థిక సహాయంను చెక్కుల రూపేణా అందజేశారు.

మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విమల దేవి, గౌరవ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నీరజ రెడ్డి, గౌరవ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రమేశ్, గౌరవ కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, మంజుల రఘునాథ్ రెడ్డి, రోజాదేవి రంగరావు తో కలిసి 300 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీబంధు ద్వారా కుల వృత్తులకు పునర్జీవనం చేసారని, కూనరిల్లిన కులవృత్తిదారులకు ఆసరాగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు, బీసీ బంధు నిరంతర ప్రక్రియ అని, బీసీల ఆర్థిక స్వాలంబనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు , బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబెర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు, ఉద్యమకారులు ,బీఆర్ఎస్ పార్టీ అనుబంధాల సంఘాల ప్రతిధులు, మరియు కాలనీ వాసులు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ డివిజన్ కు చెందిన గుండోజు శ్రీనివాస్ చారికి బీసీ బందు చెక్కును అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి తదితరులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here