నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని తారనగర్ నాలా నుండి మస్జిద్ వరకు రూ. 2 కోట్ల వ్యయంతో చేపడుతున్న బాక్స్ బ్రెయిన్ పనులను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర చేసి పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బాక్స్ బ్రెయిన్ పనులు పూర్తయితే లింగంపల్లి, తారానగర్ పలు కాలనీ ముంపు సమస్య పరిష్కారం అవుతుందన్నారు.
అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత జిహెచ్ఎంసి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ అధికారి ఏఈ సునీల్, డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, కటిక రాంచందర్, గడ్డం రవి యాదవ్, పురం విష్ణు వర్ధన్ రెడ్డి, గోపాల్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, అజీమ్, సుభాష్ రాథోడ్, రాజ్ కుమార్, రమేష్, మహేష్ చారీ, వడ్డే శ్రీనివాస్, పట్లోల నర్సింహా పాల్గొన్నారు.