గెలుపోటములు సమానంగా స్వీకరించాలి : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల స్నేహభావం పెంపొందుతుందని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. హుడా ట్రేడ్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన “1 జీరో స్పోర్ట్స్ నెస్ట్ ను ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించి మాట్లాడారు.

క్రీడలు దేహదారుఢ్యానికి దోహదం చేస్తాయన్నారు. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. ఓటమి గెలుపునకు నాంది పలుకుతుందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు క్రీడాకారులతో కలిసి క్రికెట్‌ ఆడి వారిని ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా నిర్వాహకులైన రాజేష్, పురం విష్ణు వర్ధన్ రెడ్డి లకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్, పురం విష్ణువర్ధన్ రెడ్డి, గడ్డం రవి యాదవ్, గోపాల్ యాదవ్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, సుభాష్ రాథోడ్, సురేష్ రాథోడ్, రమేష్, అజీమ్, కిషోర్, పట్లోల నర్సింహా, నిర్వాహకుల కుటుంబ సభ్యులు శాంసన్, నాగేశ్వర్ రావు, టీ బీ గిరి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here