- కుట్టు మిషన్లు అందచేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్ హోప్ ఫౌండేషన్
సమాజ శ్రేయస్సు కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం లయన్స్ క్లభ్ ఆఫ్ హైద్రాబాద్ హోప్ ఫౌండేషన్ లక్ష్యమని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్ తెలిపారు. ఆ క్లభ్ ఆద్వర్యంలో చందానగర్ హుడాకాలనీలో రెండు కుటుంబాలకు కుట్టు మిషన్లను అందజేశారు.
ఈ సందర్భంగా లయన్ కొండ విజయ్ మాట్లాడుతూ తమ క్లభ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి సహయం చేయడం కోసం క్లభ్ సభ్యులు కలిసి కట్టుగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు దొంతి లక్ష్మీనారాయణగౌడ్, మందిరంగా కరుణాకర్ గౌడ్, గండి చెర్ల జనర్దాన్ రెడ్డి, పుట్ట వినయ్ కుమార్ గౌడ్, శంకర్ ముదిరాజ్ పాల్గొన్నారు.