అన్నమయ్యపురంలో.. అలరించిన విద్యార్థుల స్వరార్చన

నమస్తే శేరిలింగంపల్లి : అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారధ్యంలో జరిగిన అన్నమ స్వరార్చన అలరించింది. ఈ కార్యక్రమంలో “సరస్వతి సంగీత శిక్షణాలయం” గురువు ఎన్‌. సరస్వతి, వారి శిష్యులు అన్నమయ్య కీర్తనలకు తమ మధుర గాత్రంతో అందరి మన్ననలు పొందారు.

అన్నమ స్వరార్చనలో “సరస్వతి సంగీత శిక్షణాలయం” శిష్యులు

విద్యార్థులు డి. హెచ్. శ్రీ వైభవ్ లహర్, డి. హెచ్. జ్ఞాన సంవేద్య, ఎం. కృష్ణ జైత్రీ, డి. వి. పి. పి. ఎన్. యశస్వి, డి. వి. పి. పి. ఎన్. షన్ముఖ, సుబ్రహ్మణ్యం, పి. సాయి జాహ్నవి, జె. దీపిక, ఎం. ఆరాధ్య, ఎం. ఆధ్య, జి. భార్గవి, ఏ. శ్రీ ప్రసన్న షష్ట, జే. సుహాసిని సంయుక్తంగా “గణనాయకం, ఆది మూలమే, తిరుమల గిరి రాయ, నారాయణాయ, జయ లక్ష్మి వరలక్ష్మీ, ఇతడే పరబ్రహ్మ, ఇదిశిరసు మాణిక్యం, వేంకట రమణనే బారో, నినగింతకుండెను, జ్యో అచ్యుతానంద, రామచ,” వంటి ప్రముఖ సంకీర్తనలకు తమ తమ సంకీర్తనా ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నారు. వీరికి వయోలిన్ పై ఎన్. షణ్ముఖ శర్మ, మృదంగం మీద మల్లికార్జున శర్మ వాయిద్య సహకారం అందించారు. తదనంతరం కళాకారులను సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ నంద కుమార్ శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. చివరిగా అన్నమయ్య సమేత వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళ హారతి ఇచ్చారు. పసందైన ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here