నమస్తే శేరిలింగంపల్లి : “ఈసారి ఎండాకాలం నీళ్ళు లేకపోతే ప్రజలకు కేసిఆర్ గుర్తొస్తాడు ” అని ఇటీవల బిఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ వ్యంగ్యాకారంగా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, న్యాయవాది సిందo శ్రీకాంత్ ఎద్దేవా చేశారు.
కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కృంగినపుడు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదికలో బ్యారేజ్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, డిజైనింగ్, ప్లానింగ్ లో తేడాలు ఉన్నాయని, నాణ్యత సరిగ్గా లేదని, నిర్వహణలో లోపాలు వల్ల బ్యారేజ్ పిల్లర్స్ కృంగి పోయాయని నివేదిక ఇచ్చిందన్న విషయం మర్చిపోయి కేటీఆర్ మాట్లాడుతున్నారని శ్రీకాంత్ విమర్శించారు. విజిలెన్స్ ఇచ్చిన నివేదికలో సైతం నాణ్యత, నిర్వహణలో లోపాలు ఉన్నాయని 2020 నుండి 2023 వరకు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చిన ప్రాజెక్ట్ అథారిటీ పట్టించుకోలేదని పేర్కొనదని, అప్పుడు నిద్ర పోయినా బిఆర్ఎస్ ప్రభుత్వం వారి నాయకులు ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ విషయాలన్నీ ప్రజలకి తెలియదు.