- క్రిస్టియన్ సోదర, సోదరీ మణులకు బట్టలు పంపిణి చేసిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ లోని సీయోను ప్రేయర్ టవర్ లో క్రిస్మస్ కానుకలను పంపిణి చేశారు. క్రైస్తవ సోదర, సోదరీమణులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి బట్టలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ అన్ని మతాల పండగలకు ప్రాధాన్యతనిస్తూ సోదరభావంతో ఐక్యమత్యానికి ప్రతీకగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నారన్నారు. క్రిస్మస్ పండగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న క్రిస్మస్ కానుకలో భాగంగా క్రిస్టియన్ సోదర, సోదరీ మణులకు బట్టలు పంపిణి చేశామని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవారికి అనేక సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ చౌదరీ, తిరుపతి, ఇమామ్, రూప రెడ్డి పాస్టర్లు TR రాజు జార్జి రెడ్డి, జర్మయ్య సోదరి సోదరమణులు పాల్గొన్నారు.