నమస్తే శేరిలింగంపల్లి: ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శేరిలింగంపల్లి టిఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు షాకీర్ టిఆర్ఎస్వి నాయకులు కౌశిక్ రెడ్డి ని గజమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కౌశిక్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని భగవంతున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి నాయకులు రవి, నవీన్, ప్రవీణ్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.