నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను GHMC అధికారులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ స్టాలిన్ నగర్ కాలనీలో సీసీ రోడ్ల పనులను పరిశీలించామని, నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ఆధికారులను ఆదేశించారు. డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో, ప్రజలుఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. కాలనీలో నెలకొన్న రోడ్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని ముఖ్యంగా డ్రైనేజి, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంబంధిత సమస్యలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో విడతలవారీగా పరిష్కరిస్తామని, డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ ప్రసాద్ , వర్క్ ఇన్ స్పెక్టర్ రఘు, అన్వర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.