నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం మాజీ టీఆర్ఎస్ ఇన్ చార్జీ దివంగత కొండకల్ శంకర్ గౌడ్ వర్ధంతి సందర్బంగా.. ఆయన జ్ఞాపకార్థం మియాపూర్ లోని వివేకానంద సేవాసమితి అనాథాశ్రమంలో దుప్పట్లను పంపిణీ చేశారు. అనాథాశ్రమంలో దుప్పట్లు అందజేసి అనంతరం బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు రవీందర్ యాదవ్ మాట్లాడారు.
తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసి , అలసట లేకుండా పోరాటం చేసిన నాయకుడు దివంగత కొండకల్ శంకర్ గౌడ్ అని, ఆనాటి తెలంగాణ ఉద్యమంలో భాగంగా చందానగర్ లో దాదాపు 400 రోజులకు పైగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అదేవిధంగా వంటావార్పు, మానవహారం లాంటి కార్యక్రమాలు చేసి శేరిలింగంపల్లి ప్రజల మనసుల్లో ఒక దేవుడిలా నిలిచిపోయాడని, అలాంటి వ్యక్తి మన మధ్యలో లేనందుకు తెలంగాణ రాష్ట్రం చింతించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. దుప్పట్ల ను అందజేసిన నేపథ్యంలో ఆశ్రమం నిర్వాహకులు రవీందర్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవిందర్ యాదవ్, తెరాస యువ నాయకులు గణేష్ రెడ్డి పాల్గొన్నారు.