నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ లో రెండవ విడత కంటివెలుగు వైద్య శిబిరాన్ని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలోంచి వచ్చిన గొప్ప వెలుగు వంటి ఆలోచన కంటివెలుగు కార్యక్రమమని అన్నారు.
కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ లోని సగర సంఘం కార్యాలయం వద్ద, కొత్తగూడ కమ్యూనిటీ హాలు వద్ద ఏర్పాటు చేసిన కంటివెలుగు కార్యక్రమ శిబిరాలను కార్పొరేటర్ హమీద్ పటేల్ ప్రారంభించారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే మన మానవ శరీరంలో అతి గొప్ప అవయవం కన్ను అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, ప్రతి మున్సిపల్ వార్డులలో ఉచిత కంటి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అవసరం ఉన్న వారికి ఉచిత పరీక్షలు చేసి, ఉచితంగా మందులు, కళ్లజోళ్ళు అందిస్తున్నట్లు చెప్పారు. అవసరం ఉన్నవారికి ఉచితంగా కంటి ఆపరేషన్లను చేస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కంటివెలుగు కార్యక్రమం వినియోగించుకోవాలని ప్రజలను కార్పొరేటర్ హమీద్ పటేల్ కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హమీద్ పటేల్ తో బాటుగా కంటివెలుగు మెడికల్ ఆఫీసర్ డా. జోష్నా, డీఈఓ బి. నరసింహులు, తెరాస నాయకులు నరసింహ సాగర్, రక్తపు జంగంగౌడ్, తిపర్తి రఘు, రూప రెడ్డి, రవి శంకర్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, రామకృష్ణ, హీనాయత్, మధు ముదిరాజ్, నీలం లక్ష్మి నారాయణ, నీలం రాము, కేశం కుమార్, నీలం వెంకటేష్, కచ్చావా దీపక్, ఉప్పులూరి ఆనంద్ సాయి శామ్యూల్ కుమార్, నీలం లక్షణ్, మొహ్మద్ ఖాసీం, సాయి బాబు, రవీందర్ రెడ్డి, యండి అబ్దుల్ కరీం, సాయి బాబు, జహంగీర్, మధు, రాజు, శ్రీనివాస్, జగదీష్, నర్సింగ్, పుణ్యవతి, రఫియా బేగం, సునీత పాల్గొన్నారు.