ఉచితంగా అత్యున్నత వైద్యం: ప్రభుత్వ విప్ గాంధీ

  • శేరిలింగంపల్లిలో కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ 
  • సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
శేరిలింగంపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి:  రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కంటి వెలుగు సెంటర్ ను జోనల్ కమిషనర్ శంకరయ్య, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సృజన, డీసీ వెంకన్న, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతు మానవ అవయవాలలో అతి ప్రధాన అవయవం కన్ను అని, తెలంగాణలోని అంధత్వానికి గురైన అన్ని ప్రాంతాల ప్రజలకు అత్యున్నత నాణ్యమైన వైద్యం ఖర్చు లేకుండా అందుబాటులోకి తేవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత కంటి వైద్యం అందుబాటులో కి తీసుకురావడానికి కంటి వెలుగు ప్రవేశపెట్టి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  కంటి సమస్యలున్న ఉన్నవారు తమ దగ్గరి పరిసర ప్రాంతాలలో ఉన్న కంటి పరీక్షా శిబిరాలకు వెళ్లి ఉచితంగా వైద్యం, కళ్లద్దాలు పొందాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అందరం కలిసి పని చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ  పేర్కొన్నారు.

వైద్య పరీక్షల అనంతరం ప్రజలకు కళ్లద్దాలు అందజేస్తున్న గాంధీ
  • కంటి వెలుగు కేంద్రాల శిబిరాల వివరాలు..
  • కొండాపూర్ డివిజన్ పరిధి అంజయ్య నగర్ లోని సగర సంఘం కమ్యూనిటీ హాల్ , కొత్తగూడా కమ్యూనిటీ హాల్.
  • గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం వార్డ్ కార్యాలయం.
  • శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్.
  • మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలోని కల్చరల్ క్లబ్.
  • మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కమ్యూనిటీ హాల్.
  • హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ ఫేస్ 2, కమ్యూనిటీ హాల్.
  • చందానగర్ డివిజన్ పరిధిలోని PJR స్టేడియం.
  • భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG లోని సిర్కి కార్యాలయం.
  • హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కమ్యూనిటీ హాల్, రాంనరేశ్ నగర్ కమ్యూనిటీ హాల్.
  • ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని PJR నగర్ కమ్యూనిటీ హాల్.
  • వివేకానంద నగర్ డివిజన్ పరిధి వెంకటేశ్వర నగర్ కాలనీలోని సగర సంఘం కమ్యూనిటీ హాల్.
  • కూకట్ పల్లి డివిజన్ పరిధి పాపిరెడ్డి నగర్ లోని కమ్యూనిటీ హాల్ లో కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అధికారులు డాక్టర్ శైలజ, ప్రాజెక్టు ఆఫీసర్ మాన్వి, ఏఎంహెచ్ఓ నగేష్ నాయక్, సూపర్ వైజర్ జలందర్ మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిర్యాల రాఘవరావు, జనార్దన్ రెడ్డి, ప్రవీణ్, చింతకింది రవి, అన్వర్ షరీఫ్, పద్మారావు, కృష్ణ యాదవ్, వేణు గోపాల్ రెడ్డి, విరేశం గౌడ్, రమేష్ రమణ, యాదయ్య, కొండల్ రెడ్డి, నటరాజు, గోపాల్ యాదవ్, గోపి, నర్సింహ రెడ్డి, KN రాములు, కవిత, అరుణ, మరియు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here