కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించి.. అభివృద్ధి పథంలో దూసుకెళ్దాం

  • ఇంటింటా ప్రచారం చేపట్టిన శేరిలింగంపల్లి బీజేపీ ఇన్ చార్జి రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఆల్విన్ కాలనీ డివిజన్, ఆల్విన్ కాలనీ ఫేజ్ 2, జలకన్య హోటల్, లాస్ట్ బస్ స్టాప్, ఎల్లమ్మ బండ చౌరస్తాలలో బహుముఖ ప్రజ్ఞాశాలి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలంటూ శేరిలింగంపల్లి బీజేపీ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ ప్రచారం నిర్వహించారు.

ఆల్విన్ కాలనీ డివిజన్ లో నిర్వహించిన ప్రచారంలో శేరిలింగంపల్లి బీజేపీ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోదరీమణి అనితారెడ్డి తదితరులు

నవ భారత నిర్మాత, బడుగు, బలహీన వర్గాల హితం కోరే నేత, ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్తూ.. గడచిన పదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా గొప్ప వే లక్షణాలు ఉన్న వ్యక్తిని తెలిపారు. చేవెళ్ల ప్రజల కోసం గతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజవర్గాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తాయన్నారు.


ఈ కార్యక్రమంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోదరీమణి అనితారెడ్డి, కన్వీనర్ రాఘవేంద్రరావు, రవీందర్ రావు, నర్సింగ్ యాదవ్, నరసింహ చారి, కమలాకర్ రెడ్డి, రామరాజు, మణి భూషణ్, వెంకటస్వామి రెడ్డి, రాయల్, నరేందర్ రెడ్డి, కమలాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here