- ఎంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్
నమస్తే శేరిలింగంపల్లి : దేశంలో ప్రజలకు ఎదురవుతున్న ప్రజా సమస్యల పరిష్కారానికి వామపక్షాల ఐక్యతతో కూడిన ప్రజా పోరాటాలు చేయడమే కామ్రేడ్ ఎస్ కె మాసుమ్ కి నిజమైన నివాళి అని ఎంసిపిఐ (యు) అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్ది కాయల అశోక్ ఓంకార్ అన్నారు. కుత్బుల్లాపూర్ ప్రాంతంలోని గాంధీనగర్ ఠాగూర్ హైస్కూల్లో జరిగిన ఎంసిపిఐ(యు) కమిటీ సభ్యుడు, అమరజీవి కామ్రేడ్ ఎస్ కె మాసుమ్ సంతాప సభ కార్యక్రమానికి ఆయన ముఖ్యవక్తగా హాజరై కామ్రేడ్ మాసుమ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో పది సంవత్సరాలుగా బిజెపి పరిపాలనలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. గత కాంగ్రెస్ పాలన దేశ ఆర్థిక విధానాన్ని విచ్ఛిన్నం చేయగా.. బిజెపి పాలన పెట్టుబడిదారి ఆర్థిక విధానాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు కార్మిక వ్యతిరేక విధానాలను తెచ్చాయని, ప్రజల పైన ధరల భారాన్ని మోపాయన్నారు. అలాగే కార్పొరేట్ పెట్టుబడిదారి విధానాలను అవలంభించడమే కాకుండా మతోన్మాద, కులతత్వ విధానాలతో ప్రజల మధ్య విద్వేషకర రాజకీయాలను పెంచి పోషించాయని వీటిని కామ్రేడ్ మాసుమ్ ఏనాడో వ్యతిరేకించి ప్రజలకు కార్మికులకు బోధించేవారు అని గుర్తు చేశారు.
అనంతరం ఎంసిపిఐయూ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాధగోని రవి మాట్లాడుతూ కామ్రేడ్ ఓంకార్ పోరాట స్ఫూర్తితో గాంధీనగర్ ప్రాంతంలో అనేక పరిశ్రమలలో యూనియన్లు స్థాపించారని కార్మికులకు, సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు వారధిగా ఉండి ఎంసిపిఐయూ పోరాటాలను బలోపేతం చేశారని కొనియడారు. ప్రజలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక సమన్యాయం జరగాలని, చివరి వరకు తప్పించాలని, ఆయన లేనిలోటు ప్రజా ఉద్యమాలకు శ్రామిక వర్గ ప్రజలకు ఎనలేనిదన్నారు.
ఎంసిపిఐయూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కామ్రేడ్ వనం సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కౌన్సిల్ మెంబర్ ఎండి యూసుఫ్, ఏఐఏడబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ వరికుప్పల వెంకన్న, ఏఐసిటియూ జాతీయ వర్కింగ్ నెంబర్ గోనె కుమారస్వామి, రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్, జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కోశాధికారి వరప్రసాద్, మార్క్స్ భావజలవాది బీవీ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి పి. సత్యం, ఏఐఎఫ్ డీడబ్ల్యుూ రాష్ట్ర కోశాధికారి తాండ్ర కళావతి, ఏఐసీటీయూ రాష్ట్ర నాయకులు బిర్జు సింగ్, సత్యనారాయణ, జన విజ్ఞాన వేదిక తెలంగాణ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ కె బురాన్, ఎంసిపీఐయూ రాష్ట్ర కమిటీ సభ్యులు జి. మల్లేష్, కిష్టయ్య, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదంశెట్టి రమేష్, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు అంగడి పుష్ప, పల్లె మురళి, ఇస్లావత్ దశరథ్ నాయక్, వై రాంబాబు, లక్ష్మణ్ సీపీఎం కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి లక్ష్మణ్, సీపీఐ కుత్బుల్లాపూర్ మండలం కార్యదర్శి మహేష్, ఎం సీపీఐయూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాయకులు రవీందర్ గౌడ్, డి. రేణుక, జి. శివాని, సుల్తానా బేగం రజియా బేగం, లలిత, పార్వతి, డప్పు రాజు, బి సురేష్, మూర్తి, వెంకటేష్, సుభాని, మగ్దుల్, ఠాగూర్ హై స్కూల్ కరస్పాండెంట్ సాయికుమార్ పాల్గొన్నారు.