సంక్షేమ ప్రభుత్వం .. టిఆర్ఎస్ ప్రభుత్వం : ప్రభుత్వ విప్ గాంధీ

  • 40 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి /షాదీ ముబారక్ చెక్కులు పంపిణి

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పేట్ , చందానగర్, భారతి నగర్ నగర్ డివిజన్ల పరిధిలోని 40 మందికి కల్యాణ లక్ష్మి /షాదీ ముబారక్ పథకం కింద రూ. 40 లక్షల 4వేల 640 మంజూరయ్యాయి. ఈ సందర్బంగా మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, వీరేశం గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి , మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు జనార్దన్ రెడ్డి, ప్రసాద్, కర్ణాకర్ గౌడ్, కాజా, సీతారాం కార్యకర్తలు పాల్గొన్నారు.

మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి /షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here