నమస్తే శేరిలింగంపల్లి: గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఎం.సి.పి ఐ(యు) పార్టీ కార్యాలయం ఆవరణలో మియాపూర్ ముజఫర్ అహమ్మద్ నగర్ లో పార్టీ జాతీయ ఐదో మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఏఐసిటియూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ బీహర్ ముజఫర్ పూర్ లో 12 నుంచి 15 వరకు సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో బిజేపి ప్రభుత్వం మత విద్వేశాలను రెచ్చగొట్టటం ద్వారా దేశ విచ్చిన్నానికి పాల్పడుతున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఆస్థిర పరిచేందుకు కార్పొరేట్ సంపన్న వర్గాల దోపిడి చేసి సంపాదించిన డబ్బుతో మంత్రులను, ఎంఎల్ఏలను కొనుగోలు చేయ పూనుకున్నదని, మధ్యప్రదేశ్,కర్ణాటక ఇతర రాష్ట్రాలే ఇందుకు నిదర్శనం అని అన్నారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఫాసిస్టు మతోన్మాద విధానాలు — వామ పక్ష కమ్యూనిస్ట్ పార్టీల కర్తవ్యం ఆంశంపై ఎం.సి.పి.ఇయు రాష్ట్ర కమిటి బ్యానర్ తో ఓంకార్ భవన్ లో జరుపుతున్న సదస్సుకు పార్టీ సభ్యులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయ వంతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యం.సి.పి.ఐ(యు) పార్టీ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి తుకారాం నాయక్ సహాయ కార్యదర్శి మైదం రెట్టి రమేష్ గ్రేటర్ హైదరాబాద్ కమిటి కార్యదర్శివర్గ సభ్యులు, ఇసావత్ దశరత్ నాయక్ కర్ర దానయ్య, పార్టీ సభ్యులు టి.నర్సింగ్,రాములు,రాజు టి.పుష్ప రాములు పాల్గొన్నారు.