- తెలంగాణ సిద్ధాంత కర్త విగ్రహావిష్కరణలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు కొత్తపల్లి జయశంకర్ సార్ అని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. తెలంగాణ సిద్ధాంత కర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ప్రారంభోత్సవానికి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి పాల్గొని మాట్లాడారు.
జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడుని స్మరించుకున్నారు. జయశంకర్ సార్ జీవితాంతం తెలంగాణ కోసం పరితపించిన మహానుభావుడు అని, నాలుగు కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించారన్నారు. ఆయన చూపిన బాటలో ప్రయాణిస్తూ ఆయన ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. సార్ జీవితం లో చివరి క్షణం వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరాయంగా తపించిన యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్బర్ ఖాన్, ఓ. వెంకటేష్, నరేందర్ బల్లా, కంది జ్ఞానేశ్వర్, సుధాకర్, కృష్ణ, విశ్వకర్మ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అడ్లూరు రవీంద్ర చారి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కమిటీ సభ్యులు శ్రీధర్ చారి మల్లేష్ చారి, కృష్ణ చారి, వెంకటాచారి, శ్రీనివాసచారి, మహేశ్వర చారి, మారాజు అచార్య, విఠల్ చారి, ప్రభాకర్ చారి, కాలనీ వాసులు పాల్గొన్నారు.