నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయిందని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ అన్నారు. హైకోర్టు న్యాయవాది కడుమూరు ఆనందం, అందెల కుమార్ యాదవ్ తో కలిసి గద్దర్ అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా..’ పాట ఉద్యమాన్ని ఉరకలెత్తించింది అని అన్నారు.
గుండె సంబంధిత రుగ్మతతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని, ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని అన్నారు. హైకోర్టు న్యాయవాది కడుమూరి ఆనందం గారు మాట్లాడుతూ ప్రజానాయకుడు గద్దర్ తన పాటలతో ఆటలతో ప్రభుత్వాలను కదిలించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్పా డిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా..’ పాట ఉద్యమాన్ని ఉరకలెత్తించిందని అన్నారు. బడుగు, బలహీన వర్గాలపై హృదయాలపై ‘గద్దర్ ప్రత్యేక ముద్ర వేశారని అన్నారు. అందెల కుమార్ యాదవ్ మాట్లాడుతూ సమస్యలపై గొంతెత్తిన ‘ప్రజా యుద్ధనౌక’ దివికేగిందని, తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయిందని అన్నారు.