- విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహావిష్కరణ
- నివాళులర్పించిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: హాఫీజ్ పెట్ డివిజన్ హుడా కాలనీలో విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహావిష్కరణ వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. అనంతరం హాఫిజ్ పేట్ , మాదాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ లతో కలిసి జయశంకర్ పార్క్ లో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కార్పొరేటర్లు మాట్లాడుతూ.. తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని అన్నారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సర్ చేసిన నిరంతర కృషిని, ఆయన ధృడ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదని అన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విశ్వకర్మ ఫౌండేషన్ సభ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అడ్లూరు రవీంద్ర చారి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కమిటీ సభ్యులు శ్రీధర్ చారి, మల్లేష్ చారి, కృష్ణ చారి, వెంకటాచారి, శ్రీనివాసచారి, మహేశ్వర చారి, మారాజు అచార్య, విఠల్ చారి, ప్రభాకర్ చారి, డివిజన్ నాయకులు రాజేశ్వర్ గౌడ్, హాఫీజ్ పేట్ ఎస్.సి సెల్ అధ్యక్షులు కంది ఙ్ఞానేశ్వర్, ప్రవీణ్, మహమ్మద్ ఇస్మాయిల్, హుడా కాలనీ బిఆర్ఎస్ అధ్యక్షులు చంద్రశేఖర్, కాలనీ సభ్యులు సురేష్, మూర్తి, గోపాల్, విజ్ఞేష్ పాల్గొన్నారు.