జయశంకర్ సార్ ఆశయాల సాధనకు కృషి చేస్తాం

  • జయశంకర్ సార్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ
  • నివాళులర్పించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం హాఫిజ్ పెట్ డివిజన్ లోని హుడా కాలనీ కూడలి వద్ద విశ్వకర్మ ఫౌండేషన్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ విగ్రహ ఆవిష్కరణ చేపట్టారు.

ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బండి రమేష్ మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయాలను తూచా తప్పకుండా ముందుకు తీసుకువెళ్లి ప్రజలకు న్యాయం చేయడానికి కృషి చేస్తానన్నారు. జయ శంకర్ సార్ తన కలలు పేదరికం లేని తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే.. అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు తర్వాత హుడా కాలనీ పార్కులో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి జయశంకర్ సార్ అమర్ రహే అని నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో బండి రమేష్ ను శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గంగారం, సంగారెడ్డి, సాయి అన్న, ఉమేష్, దేవేందర్, సిల్వర్ మనీష్, నార్ని సురేష్, పద్మ మోహిని, వెంకటరమణ, మునాఫ్, గౌస్ బాయ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here