నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ శ్రీనివాస్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆ కాలనీలో స్థానిక నాయకులతో కలసి పర్యటించారు. స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు స్తానికులు. కాలనీలో ప్రధాన వీధుల్లో నూతనంగా అంతర్గత డ్రైనేజీ లైన్లు వేయగా, మరికొన్ని చిన్న వీధుల్లో వెయ్యాల్సిన ఆవశ్యకతను వివరించారు.
అంతర్గత డ్రైనేజీ అవుట్ లెట్ సమస్యను గూర్చి కార్పొరేటర్ కి వివరంగా స్థానికులు తెలిపారు. అవుట్ లెట్ పునరుద్దరణకు అడ్డుకుంటున్న కొందరి వ్యక్తుల గురించి వివరించి, త్వరిత గతిన సమస్యను పరిష్కరించాలని కోరారు. అవుట్ లెట్ సమస్యను కాలనీవాసులంతా కలసి పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చెయ్యగా, కొందరు వ్యక్తులు అడ్డుకొని, గొడవ పడుతున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే గాంధీ దృష్టికి ఈ సమస్యను తీసుకోని వెళ్లి, అధికారులు సమన్వయంతో డ్రైనేజీ అవుట్ లెట్ సమస్యను పరిష్కరిస్తానని కాలనీవాసులకు ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ హామీ ఇచ్చారు. ఈ పాదయాత్రలో కాలనీలో ఉన్న కొన్ని కాళీ ప్లాట్ లలో మొక్కలు పెరిగి, ప్రజలు చెత్తను అందులో వేయటం వల్ల, కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాటం కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు గమనించారు. ప్లాట్ యజమానుదారులకు ప్లాట్ చుట్టూ గోడ కట్టుకోవాలని, ప్లాట్ లోపల మొక్కలు తీయించి, శుభ్రం చేయించాలని చరవాణిలో సూచించారు. కాలనీలో కొన్ని చోట్ల ఉన్న చెత్త కుప్పలు తక్షణమే తీయించాలని, స్వచ్ ఆటోలు ప్రజలు వినియోగించుకోనేలా చూడాలని శానిటేషన్ ఇంచార్జ్ రాజయ్య కు చరవాణిలో ఆదేశించారు. ఈ పాదయాత్రలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రక్తపు జంగం గౌడ్, బీవి బ్రహ్మం, కే కృష్ణయ్య, కే. వెంకటేశ్వరావు, ఏ శ్రీనివాస్ రావు, శ్రీను, జయమ్మ, ఇందిరా, గౌరమ్మ, ఆండాలమ్మ, కన్నయ్య, జై రాములు, సౌరవ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.