నమస్తే శేరిలింగంపల్లి : ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీని అందించడం ఖాయమని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ జయశంకర్ నగర్, మహంకాళి నగర్, శంశిగుడా నుంచి రాయపాటి వెంకటకృష్ణ, రాయపాటి రమణ, కేటీఆర్ కాలనీ కరుణాకర, అనిల్, జయశంకర్ కాలనీ మహేష్, దుర్గ, గాఫోర్, దేవా నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్, బిజెపి పార్టీ నుంచి సుమారు 400 మందికి పైగా కార్యకర్తలు, నాయకులు, మహిళలు స్థానిక నాయకులు పట్వారీ శశిధర్ నేతృత్వంలో డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీనివాస్, నాయకులు నల్ల సంజీవ రెడ్డి నాయకత్వంలో ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో కాంగ్రెసులో చేరారు.
ప్రజల ఆశీర్వాదం బలంగా ఉందని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధిస్తుందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సిటీకి ఆనుకొని ఉన్న శేరిలింగంపల్లి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఎంపీగా గెలిస్తే మరింత అభివృద్ధి చేసుకొనే అవకాశం ఉందని అందుకు కార్యకర్తలు సిఫాయిల్లా పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కృష్ణ ముదిరాజ్, వీరేందర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, మనెపల్లి సాంబశివరావు, సంగారెడ్డి, ప్రభాకర్, దినేష్, తిరుపతి, రమేష్, రవి, మారెళ్ళ, శ్రీనివాస్, సంగామేశ్, అగర్వాస్, బుక్కా శ్రీను, తిరుపతి, రవి యువ నాయకులు రెహ్మాన్, లోకేశ్, మజ్జర్, పండు, శివ, ప్రవీణ, రఫీ పాల్గొన్నారు.