నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బాబు జగజీవన్ రాం వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ స్ఫూర్తిదాత. ఆదర్శనీయుడు.. అణగారిన సమూహాల మహానాయకుడు.. నిజమైన భారత ‘రత్న’ డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ అని అన్నారు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రభాకర్, కృష్ణ, దామోదర్ పాల్గొన్నారు.