ప్రతిఒక్క మహిళ‌ స్వయం సహాయక సంఘాలలో చేరాలి: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జూలై 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని కార్పొరేటర్ వార్డ్ కార్యాలయంలో వార్డ్ లెవెల్ స్వయం సహాయక సంఘాల ప్రత్యేక సమావేశంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్పొరేటర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు రావాల్సిన వడ్డీ లేని రుణాలను 2023-2024, 2024-2025 సంవత్సరానికి గాను ప్రభుత్వం త్వరలో జమ చేయనున్నందున మహిళా సమైక్య సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సర్కిల్ పరిధిలో మంజూరైన వడ్డీ లేని రుణాల చెక్కులను త్వరలోనే నియోజకవర్గం వారీగా పంపిణి కార్యక్రమం చేపడతామని అన్నారు. ప్రతిఒక్క మహిళ‌ స్వయం సహాయక సంఘాలలో చేరి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతోపాటు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకుల ద్వారా రుణాల సదుపాయం పొంది అభివృద్ధి చెందాలని సూచించారు. ప్రతి నెల బ్యాంకు వారు నిర్దారించిన సమయంలోపే రుణాలు చెల్లుంచుకోవాలని లేదంటే రుణాలకు అర్హత కోల్పోతారని సూచించారు. అనంతరం దోమల వలన కలిగే ఆరోగ్య సమస్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ నాగమల్లేశ్వరి, కమ్యూనిటీ ఆర్గనైజర్ శ్రీకాంత్, శేరిలింగంపల్లి వార్డ్ లెవెల్ సమైక్య అధ్యక్షురాళ్లు, ఆర్ పి లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here