నమస్తే శేరిలింగంపల్లి: నల్లగండ్ల రవీంద్ర గార్డెన్స్ లో హెచ్ సియూలోని హాస్టల్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న కె నరసింహ పదవి విరమణ కార్యక్రమాం నిర్వహించారు. ఈ సందర్బంగా జా తీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్, షేక్ ఖాసిం, జయరాజులు ఆయనకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. గత 38 సంవత్సరాలుగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హాస్టల్ డిపార్ట్ మెంట్ లో పనిచేసి విశిష్ట సేవలు అందించారన్నారు.
ప్రజల అభివృద్ధి కోసం.. కాలనీ కోసం.. అహర్నిశలు కృషి చేయాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. భవిష్యత్తులో సకల శుభాలు జరగాలని.. తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉపాధ్యాయులు జయరాజ్ సింగ్, కావాటి చంద్రశేఖర్ యాదవ్, ప్రభాకర్ యాదవ్, కే రాము యాదవ్, ఏ రాజు, రాయుడు, కమ్మర్ పాషా, ధన శేఖర్ నాయక్, కె విట్టల్, కే యాదయ్య, డీజే భువన్, శ్రీకాంత్, బేరి చంద్రశేఖర్, గోకుల్ జ్యోతి మాస పత్రిక ఎడిటర్ ఈగల లక్ష్మీనారాయణ యాదవ్, మరియు సెంట్రల్ యూనివర్సిటీ కే నరసింహ యాదవ్ తోటి ఉద్యోగస్తులు కాలనీ పెద్దలు మహిళా సోదరిమణులు యువజన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సన్మానం చేశారు