శేరిలింగంపల్లి, జూలై 9 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ శాఖ మంత్రి డి. అనసూయ సీతక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమెకు దొంతి రవిశంకర్ ముదిరాజ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దొంతి రవిశంకర్ మాట్లాడుతూ సీతక్క ప్రజలతో మమేకమై నిరంతరం వారి కోసం పోరాడుతున్న శక్తివంతమైన నాయకురాలని అన్నారు. ఆమె జీవిత పోరాటం ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోందని, తెలంగాణ గ్రామీణాభివృద్ధికి ఆమె చేపడుతున్న కార్యాచరణలు ప్రశంసనీయం అని అన్నారు.