శేరిలింగంపల్లి, జూలై 8 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి గాంధీనగర్ ఎన్ ఎన్ రెడ్డి బోటిక్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుని నాయకులు ప్రసంగించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐక్య వేదిక అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ హాజరై మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసినసేవలను కొనియాడారు. ప్రజలందరినీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లలాగా ఆదరించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలనకు వైఎస్ చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, నేతాజీ నగర్ కాలనీ రెడ్డి బోటిక్ ఎన్ ఎన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రాయుడు , మౌలానా, కెనరసింహ యాదవ్ , బాలరాజ్ సాగర్, భరత్ , శ్రీనివాస్, అశోక్, కిరణ్ పాల్గొన్నారు.






