క‌ల్తీ క‌ల్లు ఘ‌ట‌న‌కు కార‌కులైన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటాం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూలై 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి చరణ్ కాలనీలో 12 మంది కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురై రాందేవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని వెంటనే రాందేవ్ ఆసుపత్రికి వెళ్లి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ బాధితులను పరామర్శించి మెరుగైన వైద్య సహాయం అందించాలని డాక్టర్లకు తెలియజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురై రాందేవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడం జరిగింద‌ని ,మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింద‌ని , కల్తీ కల్లు ఘటన జరగడం చాలా బాధాకరం అని , ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వారు ఎంతటి వారైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఘటన పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశిస్తూన్నాను అని అన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం ప్రభుత్వం తరపున అందిస్తామని, అన్ని విధాలుగా అండగా ఉంటామ‌ని, ఎవరు అధైర్య పడకూడదని ,ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, అధికారులు అలసత్వం వీడి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని,పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యోబ్ , నాయకులు జిల్లా గణేష్, కాశినాథ్ యాదవ్, కిషన్, పురెందర్ రెడ్డి, ఎల్లం నాయుడు, భాస్కర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here