శేరిలింగంపల్లి, జూలై 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని హల్ కాలనీలో రూ.4 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణం పనులను GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ హల్ కాలనీలో ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరిందన్నారు. కాలనీతోపాటు KMR ఎస్టేట్ , పార అమౌంట్ కాలనీలు, చుట్టుపక్కల కాలనీల వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజలకు సాంత్వన చేకూరిందని, ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం 4 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా సీసీ రోడ్ల నిర్మాణం పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు DE ఆనంద్, AE భాస్కర్, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, దాత్రి గౌడ్, హరికృష్ణ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






