నమస్తే శేరిలింగంపల్లి: స్వాతంత్య్ర సమరయోధుడిగా , సంఘ సంస్కర్తగా, అఖండ భారతావనికి విశేష సేవలందించిన గొప్ప దార్శనికుడు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ 37వ వర్దంతి సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ లో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, మాజీ కార్పోరేటర్ మాధవరం రంగరావు తో కలిసి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఆత్మ విశ్వాసమే ఆయుధంగా.. దళితుల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల కోసం నిత్యం పాటుపడిన మహానుభావుడని పేర్కొన్నారు. జగ్జీవన్ రామ్ ఆశయాలను, సేవలను స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు.
ఈ తరం ప్రజలకు ఆయన జీవితం ఆదర్శప్రాయం అన్నారు. కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు సమ్మారెడ్డి, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, జిల్లా గణేష్, రాజేష్ చంద్ర, చిన్నోళ్ల శ్రీనివాస్, కాశినాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, జాన్, కైసర్, అగ్రవాసు, సంగమేష్, రాములుగౌడ్, యాదగిరి, రవీందర్, మహేష్, ముజీబ్, ఇంతియాజ్, సంతోష్ బిరాదర్, కటికరవి, శామ్యూల్, వాలి నాగేశ్వరరావు, ఉమేష్, కూర్మయ్య, పుట్టం దేవి, సావిత్రి, ప్రీతి, రేణుక, సురేఖ, వెంకటలక్ష్మి, శ్రీను, రాజు పాల్గొన్నారు.