ఫిష్ వెంకట్ కి జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని రూ.2 లక్షల వైద్య సహాయం

శేరిలింగంప‌ల్లి, జూలై 9 (నమ‌స్తే శేరిలింగంప‌ల్లి): జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో ఆయ‌న స్థాపించిన సేవా సంస్థ 100 Dreams Foundation ద్వారా సినీ నటుడు ఫిష్ వెంకట్ వైద్య అవసరాల కోసం రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. చందానగర్ పి ఆర్ కె ఆసుపత్రిలో ఫిష్ వెంకట్ కూతురు స్రవంతికి చెక్కు అందజేశారు. చిత్రపరిశ్రమలో తనదైన హాస్యంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయన వైద్య ఖర్చులకు మద్దతుగా ఈ ఆర్థిక సహాయం అందించడం హీరో కృష్ణ మానవతా విలువలను ప్రతిబింబిస్తోంద‌ని ప‌లువురు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ మానినేని మాట్లాడుతూ 100 Dreams Foundation లో ఒక కార్యక్రమం అయిన పునరపి (అవయవ దానం అవగాహన కార్యక్రమం) త‌మ‌ ఆశయం మాత్రమే కాదు, అవసరంలో ఉన్నవారికి జీవితం ఇవ్వాలన్న సంకల్పం అని అన్నారు. అవయవ దానం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల‌ని, ఒక్క నిర్ణయం ఒక జీవితం అని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here